తెలుగు సంపద

మన భాష - మన సంస్కృతి - మన మూలాలు

తెలుగు భాషా బ్రహ్మోత్సవం & సదస్సు - 2026 29 ఆగస్టు 2026 (శనివారం)

కీ.శే. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (రాజమహేంద్రవరం) మరియు "తెలుగు సంపద" (బెంగళూరు) వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక భాషా సదస్సు.

తెలుగు భాషా బ్రహ్మోత్సవం 2026 ఆహ్వాన పత్రిక
తెలుగు భాషా బ్రహ్మోత్సవం 2026 ఆహ్వాన పత్రిక

సమయం & వేదిక

తేదీ: 29 ఆగస్టు 2026 (ఉదయం 9:30 నుండి సా|| 5:00 వరకు)

వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం, బొమ్మూరు, రాజమహేంద్రవరం.

సదస్సు ప్రధాన అంశం

"తెలుగు భాషా పరిరక్షణ పరివ్యాప్తి - మార్గదర్శక సూత్రాలు"

కీలకోపన్యాసం: ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు

ప్రముఖుల ప్రసంగాలు & నిర్వహణ:

  • ఆచార్య మునిరత్నం నాయుడు గారు (ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)
  • డా. మూర్తి రేమెళ్ళ గారు (వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలుగు సంపద", బెంగళూరు)
  • భాషా చర్చా వేదికలు, సాహిత్య గోష్ఠి, జానపద/సాంస్కృతిక ప్రదర్శనలు మరియు అరుదైన తెలుగు గ్రంథాల ప్రదర్శన.

పరిశోధనా పత్రాల సమర్పణ వివరాలు:

"తెలుగు భాషా పరిరక్షణకు, పరివ్యాప్తికి నేనేమి చేశాను, చేయించాను, చేయబోతున్నాను" అనే ప్రధాన అంశంపై విద్యాబోధన, ప్రభుత్వ పరిపాలన, సాంకేతిక, న్యాయశాస్త్రం, ప్రచార సాధనాల రంగాలకు సంబంధించిన పరిశోధనా పత్రాలు ఆహ్వానించబడుతున్నవి.

  • పత్రాల పంపుటకు చివరి తేదీ: 20-08-2026 (ఈమెయిల్: murthyremilla@yahoo.com)
  • నమోదు రుసుము: ₹200/- (ఎంపిక చేసిన యోగ్యమైన పత్రాలకు మాత్రమే అనుమతి)
  • సంప్రదించు నంబరు: డా. మూర్తి రేమెళ్ళ - 99808 53662

"దేశభాషలందు తెలుగు లెస్స! మన భాషను గౌరవిద్దాం.. మన సంస్కృతిని కాపాడుకుందాం!"

- అందరికీ సాదర ఆప్యాయ ఆహ్వానం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2026 21 ఫిబ్రవరి 2026

అమ్మ భాష మన గుర్తింపు. మాతృభాషను పరిరక్షించుకోవడం, రాబోయే తరాలకు అందించడం మనందరి బాధ్యత.

తెలుగు భాషా దినోత్సవం 2025

మాతృభాషా దినోత్సవం 2025

తెలుగు భాషా దినోత్సవం 2024

మాతృభాషా దినోత్సవం 2024

తెలుగు భాషా దినోత్సవం 2023

మాతృభాషా దినోత్సవం 2023